రెండవ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల నిరసన

NRML:పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఒప్పంద కార్మికులు చేపట్టిన నిరసన మంగళవారం రెండవ రోజుకు చేరుకుంది. రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకనైనా అధికారులు స్పందించి తమ వేతనాలను విడుదల చేయాలని మున్సిపల్ కార్మికులు కోరారు. కార్మికుల నిరసనతో పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయింది.