మహాసభలు విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

మహాసభలు విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ

VZM: సీఐటీయూ అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వంతెన మీదుగా పురిటిపెంట సచివాలయం వరకు బైక్ ర్యాలీ జరిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరగనున్న జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.