VIDEO: బ్రిడ్జి దిమ్మెలు కూలి ప్రమాదం
GDWL: పెద్దఅముదలపాడు–నారాయణపురం ప్రధాన రహదారిలోని పెద్దవాగు బ్రిడ్జిపై రక్షణ దిమ్మెలు కూలిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి వాగులో పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలానికి ముందే అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.