VIDEO: రెండు మండలాలకు రాకపోకల బంద్

ELURU: జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం శివారులోని కల్వర్టుపై జల్లేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. దీంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో కొయ్యలగూడెం మండలానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.