పేకాట ఆడుతున్న ఆరు మంది అరెస్ట్
SRPT: పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చివ్వేంల ఎస్సై మహేష్ తెలిపారు. ఇవాళ బీబీగూడెం శివారులో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూ. 3,000నగదు, 6 ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.