VIDEO: టోల్ ప్లాజా వద్ద నిరసన

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు టోల్ ప్లాజా వద్ద శనివారం సిపిఐ పార్టీ నాయకులు తాము టోల్గేట్ బిల్లు కట్టమని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాసభల నిమిత్తం పల్నాడు జిల్లా నుంచి ఒంగోలు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే టోల్ ప్లాజా వద్ద సిబ్బంది తమను డబ్బులు అడిగినట్లు తెలిపారు.