ఆలయ నిర్మాణానికి విరాళం అందుచేత

ఆలయ నిర్మాణానికి విరాళం అందుచేత

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఆరేపల్లి అప్పారావు–శారద దంపతులు శ్రీ హరిహరసత అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణానికి రూ.54,000 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు గూడవల్లి రత్నశేఖర్, తమిరి రమేష్, కొల్లి వెంకట్రావు, తుమ్మల నారాయణరావు తదితరులు అప్పారావుకి కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.