VIDEO: నేడే ఫ్లీట్ రివ్యూ...ముఖ్య అతిథిగా రాష్ట్రపతి
VSP: విశాఖ సాగరతీరంలో 'మిలాన్-2026' వేడుకలు అంబరాన్నంటాయి. బుధవారం జరిగే ప్రధాన ఘట్టంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని, సుమారు 50 దేశాలకు చెందిన 70కి పైగా యుద్ధనౌకలను సమీక్షించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ ప్రదర్శనలో 50కి పైగా యుద్ధ విమానాలు కూడా గగనతలంలో విన్యాసాలు చేయనున్నాయి.