అది పుతిన్ వేస్తున్న ట్రాప్: ఈయూ

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఈయూ దౌత్యవేత్త కాయా కల్లాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకునేందుకు పుతిన్ ఉచ్చు వేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే శాంతి ఒప్పందం కోసం చర్చలకు అంగీకరించారని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకోవడమే రష్యా లక్ష్యమని పేర్కొన్నారు.