జిల్లా కలెక్టర్‌కు అరుదైన అవార్డు

జిల్లా కలెక్టర్‌కు అరుదైన అవార్డు

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందుకోనున్నారు. 'జల్ సంచయ్ జన్ భాగీదారీ' కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.