'బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యం'

KMM: బహుజనులకు రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర నాయకుడు దాగిళ్ల దయానందరావు అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలైన బహుజనులకు రాజ్యాధికారం బహేన్ కుమారి మాయావతి నాయకత్వంలో లభిస్తుందన్నారు. జిల్లాలో మాన్యశ్రీ కాన్షిరాం పని విధానంతో ముందుకు సాగి కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.