భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

MBNR: రాబోయే మూడు రోజులు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు పోలీసులు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు ప్రవహిస్తున్న వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని నిండుకుండలా ఉన్న చెరువుల వైపు వెళ్ళకూడదన్నారు.