తగ్గిన నిరుద్యోగ రేటు
TG: ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి దేశంలో నిరుద్యోగ రేటు 4.9 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో ఇది 5 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం దిగిరావడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో గ్రామీణ నిరుద్యోగం 4.2 శాతంతో స్థిరంగా కొనసాగుతోంది. మహిళల్లో కూడా నిరుద్యోగం 5.6 శాతం నుంచి 5.1 శాతానికి తగ్గింది.