పెట్రోల్‌పై వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: CP

పెట్రోల్‌పై వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: CP

WGL: పెట్రోల్ పై SMలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయన్నారు. సరఫరా నిరంతరం కొనసాగుతోందన్నారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దన్నారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.