విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ
JGL: పెగడపల్లి మండలంలోని బత్కపల్లి గ్రామానికి చెందిన యువ క్రీడాకారులకు గ్రామ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడు వెంకటరమణ సొంత ఖర్చులతో క్రీడాకారులకు బ్యాట్లు సర్పంచ్ మహేశ్వరి మధుకర్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి క్రీడకారులుగా ఎదిగి, రాణించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం, శారీర దృఢత్వం పెంచుతుందన్నారు.