VIDEO: విషాదం.. మినీ వ్యాన్ ఢీకొని మహిళ, 5 గేదెలు మృతి
BPT: చీరాల మండలం 167ఏ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. పశువులను తోలుకు వెళ్తున్న సావరపాలెం గ్రామానికి చెందిన సుబ్బయమ్మను వెనుక నుంచి వచ్చిన మినీ వ్యాన్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఐదు గేదెలు కూడా దుర్మరణం పాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.