కేసీ కెనాల్ పరిశుభ్రతలో ప్రజల పాత్ర కీలకం: కమిషనర్
కర్నూలు నగర పరిధిలో కేసీ కెనాల్‌ను పరిశుభ్రంగా పరిరక్షించడంలో ప్రజల సహకారం అత్యంత కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇంజనీరింగ్, జలవనరుల శాఖ అధికారులతో కలిసి కార్ల్ మార్క్స్ నగర్, అశోక్ నగర్, వినాయక ఘాట్ ప్రాంతాల్లో కెసి కెనాల్‌ను పరిశీలించారు.