'టవర్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలి'

'టవర్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలి'

PPM: జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన క్యాటగిరీ-5, క్యాటగిరీ-6 మొబైల్ టవర్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో బి.ఎస్.ఎన్.ఎల్.అధికారులు, ఏడీఈలతో జిల్లాలో టవర్ల ఏర్పాటు పురోగతిపై ఆయన సమీక్షించారు.