లెక్చరర్లకు పీహెచ్డీలో ప్రత్యేక కోటా కల్పించాలని వినతి

లెక్చరర్లకు పీహెచ్డీలో ప్రత్యేక కోటా కల్పించాలని వినతి

KNR: శాతవాహన వర్సిటీ పీహెచ్ఎ ప్రవేశాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు ప్రత్యేక కోటా కేటాయించాలని టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం వర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, సంఘ బాధ్యులు డాక్టర్ టీ. శ్రీనివాస్ పాల్గొన్నారు.