కుభ్యనాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవం
కామారెడ్డి జిల్లాలోని పెద్ద కొడఫ్గల్ మండలం కుబ్యానాయక్ తండా సర్పంచ్‌గా బీసీ మహిళ గాయత్రిని తండా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గాయత్రిని ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు నిన్న అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కుబ్యానాయక్ తండా ప్రజలు సర్పంచ్‌ను ఏకగ్రీవం చేస్తూ తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.