నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
GNTR: మంగళగిరి పట్టణ పరిధిలో గురువారం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ సురేష్ బాబు తెలిపారు. గౌతమ బుద్ధా రోడ్, కోనేరు సెంటర్, జి.ఆర్ స్కూల్, హుస్సేన్ కట్ట, ఇస్లాంపేట, పాత మంగళగిరి, ఊర్వశి సినిమా హాల్ రోడ్ ప్రాంత ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.