BREAKING: GTపై టాస్ గెలిచిన RR
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన RR బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన GT, తమ హోమ్ గ్రౌండ్‌లో విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరవాలని పట్టుదలగా ఉంది. గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన 8 మ్యాచ్‌ల్లో GT 6 సార్లు గెలిచి రాజస్థాన్‌పై స్పష్టమైన పైచేయి సాధించింది.