కొచ్చిలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌

కొచ్చిలో కుప్పకూలిన వాటర్ ట్యాంక్‌

కేరళ కొచ్చిలోని తమ్మనం అనే ప్రాంతంలో కేరళ వాటర్ అథారిటీకి చెందిన ట్యాంక్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో జనావాసాలపైకి 1.35 కోట్ల లీటర్ల వరద పోటెత్తింది. ఫలితంగా ఇళ్ల వద్ద పాక్కింగ్ చేసిన వాహనాలు, ఫర్నీచర్‌తో పాటు అనేక ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో మెడిసన్స్, వైద్య పరికరాలు దెబ్బతిన్నాయి.