న్యాయవాదికి సైబర్ వల.. రూ.72L హాంఫట్

న్యాయవాదికి సైబర్ వల.. రూ.72L హాంఫట్

AP: కడప జిల్లా బద్వేలుకు చెందిన ఓ సీనియర్ న్యాయవాదిపై సైబర్ నేరగాళ్లు వల విసిరారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదైందని భయపెట్టి ఏకంగా రూ.72 లక్షలు విడతల వారీగా ఖాతాకు జమ చేయించుకున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఇద్దరు విశ్రాంత ఉద్యోగులు ఈ తరహాలోనే డబ్బు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయినట్లు భావించి న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు.