కోటి సంతకాల సేకరణ నిర్వహించిన వైసీపీ
విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ–కోటి సంతకాల సేకరణ బుధవారం జరిగింది. కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ కె.కె రాజు ముఖ్య అతిథి. ప్రజాభిప్రాయం లేకుండా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.