'HIT TV' కథనానికి స్పందన

'HIT TV' కథనానికి స్పందన

WGL: MGM ఆసుపత్రిలో చికిత్స కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాల్సి ఉండగా, ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపుతున్నారన్న విషయాన్ని నిన్న 'HIT TV' వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కథనంపై MGM సూపరింటెండెంట్ హరిచందర్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఇకపై అన్ని పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.