'కూటమి ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోంది'
GNTR: కూటమి ప్రభుత్వం బీసీలపై వివక్ష చూపుతోందని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్రాంతి కుమార్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో బీసీలు తమ వెన్నెముక అని చెప్పి అధికారంలోకి వచ్చాక దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో మాట్లాడుతూ.. బీసీలపై దాడులు, కేసులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.