నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జులై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి శివప్రసాదరావు నేడు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% వచ్చాయన్నారు. గణిత శాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు.