ఘనంగా RS ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
SRPT: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 58వ జన్మదినం పురస్కరించుకుని మఠంపల్లి BRS మండల అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బహుజన సమాజానికి రాజ్యాధికారం లక్ష్యంతో పని చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.