వరుస బాంబు పేలుళ్లు.. 23 మంది మృతి

వరుస బాంబు పేలుళ్లు.. 23 మంది మృతి

నైజీరియాలోని మైదుగురిలో వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ఆత్మాహుతి దాడుల్లో 23 మంది మృతిచెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ పేలుళ్లు నగరంలోని రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. మార్కెట్, పోస్ట్ ఆఫీస్, ఆసుపత్రి సమీపంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల వెనుక తీవ్రవాద సంస్థ బోకో హరమ్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.