పుంగనూరులో రేపు గరుడ సేవ
CTR: ఈ నెల 5న పౌర్ణమి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి గరుడ వాహన సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే సాయంత్రం 7: 30 నిమిషాలకు వాహన సేవ ప్రారంభమైతుందని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.