బసవేశ్వర జయంతి నిర్వహించాలని వినతి
NRML: ఈ నెల 19న మహాత్మా బసవేశ్వర జయంతిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ప్రతినిధులు కలెక్టర్ అభిలాష అభినవ్‌కు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. వేడుకల నిర్వహణకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.