రెండు వాహనాలు ఢీ.. ఇద్దరికీ గాయాలు

రెండు వాహనాలు ఢీ.. ఇద్దరికీ గాయాలు

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో నేషనల్ హైవే 167పై తుర్కలపల్లి గేటు వద్ద సోమవారం సాయంత్రం రెండు వాహనాలు ఢీకొన్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన మారుతి ఎర్టిగా, పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన బొలెరో వాహనాలు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్ వాసులకు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని కల్వకుర్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.