కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

KMM: ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో మహిళల పాత్రను అభినందించారు. పలు రంగాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు.