'రాజమండ్రి రూరల్లో మంచినీటి కష్టాలు తీరుతాయి'
తూ.గో: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ కింద రూ.196 కోట్లతో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించుకోలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు.