VIDEO: జల బిందెలతో శ్రీలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవం
PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో కొలువైన శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి పదో వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం నిర్వహించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొని జలబిందలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని దర్శించుకున్నారు.