VIDEO: బ్రహ్మయ్య హత్య కేసులో నిందితులు అరెస్ట్

ప్రకాశం: బేస్తవారిపేటలో ఈనెల 3న జరిగిన బ్రహ్మయ్య హత్య కేసులో నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. బ్రహ్మయ్యపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న రవి పథకం ప్రకారమే, తన దగ్గర పనిచేస్తున్న ఇద్దరు మైనర్ యువకుల సహాయం తీసుకొని హత్య చేసినట్లు తేలింది. నిందితులు బ్రహ్మయ్య తలపై బండరాయితో కొట్టి, ఛాతిపై ఆరు సార్లు కత్తితో పొడిచారని డీఎస్పీ తెలిపారు.