ధర్మవరంలో శ్రీవారిని తాకిన సూర్యకిరణాలు
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని శ్రీనివాస నగర్‌లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకాయి. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన అర్చకులు, భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత క్షణాలను భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.