'ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వే లైన్ DPRను ఆమోదించండి'
ADB: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కలిశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ వారు రైల్వే బోర్డుకు పంపిన ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను ఆమోదించాలని విన్నవించారు. దీంతో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.