రూ. 250 కోట్లతో మరో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

KMM: ఖమ్మంలో తొలి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ. 250 కోట్లతో 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు.