జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..?
అనంతపురం జిల్లాలో మాంసం ధరలు ఆదివారం భారీగా పెరిగాయి. ఎండల తీవ్రతతో కోళ్ల పెంపకం తగ్గడంతో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.300 నుంచి రూ.350 వరకు పలుకుతోందని వ్యాపారస్తులు వెల్లడించారు. ఫారం కోడి కిలో రూ.200, మటన్ రూ.800లుగా ఉంది. చేపలు రకాన్ని బట్టి రూ.120-130 మధ్య అమ్ముడవుతున్నాయి. ఆయా ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చని తెలిపారు.