మంత్రి పొంగులేటి ఇలాకాలో బీఆర్ఎస్ విజయం
KMM: మంత్రి పొంగులేటి ఇలాకా, పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమీప అభ్యర్థిపై గెలుపొందారు. ఈ విజయం పట్ల స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.