తిరుపతిలో సైబర్ మోసం

TPT: తిరుపతి సీతమ్మ నగర్‌కు చెందిన యువతి వాట్సాప్‌కు సైబర్ నేరగాళ్లు ఓ యాప్ లింక్ పంపారు. రూ. వెయ్యి కట్టించుకుని హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలన్నారు. యువతి అలా చేయడంతో ఆమెకు రూ.1200 చెల్లించారు. ఆ తర్వాత రూ. 3వేలుకు రూ. 3500 ఇచ్చారు. నమ్మిన యువతి ఒకేసారి రూ.1.29 లక్షలు వారికి ట్రాన్స్ ఫర్ చేయగా ప్లేట్ తిప్పేశారు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.