కూలేందుకు సిద్ధంగా వంతెన!

NLR: నెల్లూరు-మైపాడు మార్గంలోని భారీ మలుపు తిరిగే చోట ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు కూలుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. వంతెన రక్షణ గోడ సైతం దెబ్బతింది. గతంలో పలు ప్రమాదాలు జరిగాయని, సత్వరం తొలగించి నూతన వంతెన నిర్మించాలని స్థానికులు పలుమార్లు విన్నవించినా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.