'యుద్ధం వద్దు.. శాంతి కావాలి'
ప్రకాశం: పామూరులోని మమ్మీ డాడీ సెంటర్‌లో ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో “యుద్ధం వద్దు.. శాంతి కావాలి” అంటూ నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి మాట్లాడుతూ.. యుద్ధాల వల్ల ప్రజలకు అపార నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.