'సివిల్ శిక్షణ ప్రవేశ పరీక్షకు 279 హాజరు'
విశాఖ ఎంవీపీ కాలనీలోని బుద్ధ భవన్‌లో ఆదివారం నిర్వహించిన బీసీ స్టడీ సర్కిల్ ఉచిత సివిల్స్ శిక్షణ ప్రవేశ పరీక్షకు 279 మంది హాజరయ్యారు. మొత్తం 349 మంది దరఖాస్తు చేసుకోగా, హాజరు శాతం ఎక్కువగా ఉండటం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షను జేడీ ఎం.చినబాబు పర్యవేక్షించారు. ఫలితాలు విడుదలైన తర్వాత ఎంపికైన వారికి అమరావతిలో శిక్షణ అందించనున్నారు.