నందనం రైతు కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
HNK: ఐనవోలు మండలం నందనం గ్రామానికి చెందిన రైతు తోటకూర సోమయ్య (కటిక సోమయ్య) అకాల వర్షాలకు పంటలు నష్టపోయి ఆత్మహత్యయత్నం పాల్పడ్డ ఘటనపై వర్ధన్నపేట ఎమ్మెల్యే శనివారం హన్మకొండలోని రోహిణి హాస్పిటల్‌లో కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించి, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.