దళితవాడ సందర్శించిన ఎమ్మెల్యే

దళితవాడ సందర్శించిన ఎమ్మెల్యే

SKLM: జి.సిగడాం మండలం చెట్టుపొదిలం గ్రామంలోని దళితవాడను సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సందర్శించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. వారి అభ్యర్థనలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యలు వినడం మాత్రమే కాకుండా పరిష్కారం వరకూ కట్టుబడి ఉన్నామని MLA పేర్కొన్నారు.