'90 శాతం అర్జీలు అదే రోజు పరిష్కారం కావాలి'

'90 శాతం అర్జీలు అదే రోజు పరిష్కారం కావాలి'

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన వాటిలో 90 శాతం అర్జీలు అదే రోజు పరిష్కారం కావాలని కలెక్టర్ డా ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగని మొక్కుబడిగా ఫైలును ముగిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతీ అర్జీ విధానపరంగా జరగాలని, అధికారులందరూ ప్రత్యేక శ్రద్దను కనబరచాలని అన్నారు.