VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి
E.G: సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా మేళవించి కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం పులగుర్తలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శనివారం పంపిణీ చేశారు. మార్చి 1 ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లను అందజేశారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.